భారీ సెట్టింగ్ లతో అలరించబోతున్న బద్రీనాథ్
 |
| బద్రీనాథ్ |
అల్లు అర్జున్, తమన్నా జంటగా రూపొందిన తాజా చిత్రం "బద్రీనాథ్". ఈ నెల 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వి వి వినాయక్ దర్శకత్వం లో రాబోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల కి సిద్దమైంది. ఇప్పటికే 1000 థియేటర్ లలో ఈ సినిమా ట్రైలర్ లను ప్రదర్శిస్తున్నారు. మరో వైపు ఈ సినిమా కి 22 భారీ సెట్ లను వేసినట్టు తెలుస్తోంది. ఈ సెట్టింగ్ లన్నీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పర్యవేక్షణ లో రూపొందిచారట. ఈ సెట్టింగ్ లలో తీసిన ప్రతీ సన్నివేశం ప్రేక్షకులని ఎంతో ఆకర్షిస్తాయని సినిమా టీం చెబుతోంది.
0 comments:
Post a Comment