Home » , » హీరోల సిగరెట్ స్మోకింగ్ ఫాలో అవుతున్న యూత్

హీరోల సిగరెట్ స్మోకింగ్ ఫాలో అవుతున్న యూత్

Mallu Surf
స్టైల్ కి మరోపేరు గా చెప్పే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సిగరెట్ కాల్చే స్టైల్ డిపరెంట్ గా ఉంటుంది. రజనీకాంత్ ఏది చేసినా స్టైల్ గానే ఉంటుంది. అందులోనూ సిగరెట్ కాల్చే స్టైల్ మరింత స్టైలిష్ గా ఉండడంతో దర్శకులు ఆయన ప్రతి సినిమాలోనూ ఎక్కడో ఒక దగ్గర సిగరెట్ కాల్చే సీన్ పెడుతుంటారు. తాజాగా మన తెలుగు హీరోలు సైతం డిఫరెంట్ స్టైల్ లో సిగరెట్ కాల్చడం మొదలు పెట్టారు. మన హీరోలను చూసి వాళ్ళ వాళ్ళ అభిమానులు కూడా ఫాలో అయి పోతున్నారు. పోకిరి లో మహేష్ బాబు సిగరెట్ ని వెలిగించే స్టైల్ యూత్ ని ఎంతో ఆకట్టుకుంది. దాంతో చాలా మంది ఆ స్టైల్ కోసం ప్రయత్నించారు. పైన ఉన్న ఫోటో చూస్తే మన హీరో ల సిగరెట్ కాల్చే స్టైల్ అర్థమవుతుంది. మొత్తానికి సిగరెట్ కాల్చడం ఆరోగ్యానికి హానికరం అని ఎందరు ఎన్ని రకాలుగా చెబుతున్నా మన హీరోల స్టైల్ తో యూత్ మాత్రం తెగ సిగరెట్ లు కాల్చేస్తున్నారు.

Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger