
విజయశాంతి సినిమాలు మానేసి చాలా రోజులైంది. రాజకీయాలతో బిజీ గా ఉండడం తో సినిమాలను పక్కన పెట్టింది విజయశాంతి. అయితే తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో రాబోతున్న చిత్రం "కొలిమి". ఇటీవలే టి ఆర్ ఎస్ అధినేత కె సి ఆర్ ఈ చిత్రాన్ని క్లాప్ కొట్టి ప్రారంభించాడు. అలాగే కొలిమి చిత్రం లో పాట కూడా రాస్తున్నాడు. అయితే ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర లో విజయశాంతి నటించనుందని సమాచారం. సినిమా దర్శక నిర్మాతలు ఒక ముఖ్య పాత్ర కోసం విజయశాంతి ని సంప్రదించినప్పుడు తెలంగాణ ఉద్యమ నేపధ్యానికి సంబందించిన సినిమా కావడం తో నటించడానికి ఒ కె చెప్పిందట రాములమ్మ.
0 comments:
Post a Comment