మరోసారి తండ్రి రీమిక్స్ సాంగ్ తో రాంచరణ్
|
రాంచరణ్ తేజ్ |
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ మరోసారి తండ్రి మెగాస్టార్ పాట రీమిక్స్ తో అలరించనున్నాడు. మగధీర లో "బంగారు కోడి పెట్ట ..." సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలుసు. ఇప్పుడు రాంచరణ్ చేయబోతున్న తాజా చిత్రం "రచ్చ". సంపత్ నంది దర్శకత్వం లో రూపొందనున్న ఈ చిత్రం లో చిరంజీవి సూపర్ హిట్ చిత్రం "గ్యాంగ్ లీడర్" సినిమా లోని "గ్యాంగ్ గ్యాంగ్...బజావో గ్యాంగ్..." అనే పాటని రీమిక్స్ చేయనున్నారట. ఈ పాట లో రాంచరణ్ డ్యాన్స్ టాలెంట్ కి తగ్గట్టు ఒక అగ్రతార జత కట్టనుందట. మరి రచ్చ సినిమా లోని ఈ పాట కూడా బంగారు కోడి పెట్ట అంత అంత విజయం సాధిస్తుందేమో చూడాలి.
0 comments:
Post a Comment