రజనీకాంత్ కి ఐ సి యు లో చికిత్స ?
|
రజనీకాంత్ |
దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ కి ఐ సి యు లో చికిత్స జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదే నెలలో మూడు సార్లు రజనీ హాస్పిటల్ లో చేరారు. రజనీ కొత్త చిత్రం రాణా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి పట్టుకున్న అనారోగ్యం రజనీ ని అసలు వదలట్లేదు. ఇపుడు మరళ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రజనీ కి కాలేయం లో చేరిన వ్యర్థ పదార్థాలను తొలగించారు. అలాగే కిడ్నీ కి డయాలసిస్ కూడా చేస్తున్నారు. మరో వైపు రజనీకాంత్ ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందంటూ తమిళనాడు మీడియా లో స్క్రోలింగ్ లు వేయడం వలన రజనీ అభిమానులు, ప్రజలు తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మనమూ రజనీకాంత్ తొందరగా కోలుకొని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం.
0 comments:
Post a Comment