సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా "ఏక్ థా టైగర్" చిత్రం రూపొందుతుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ఇస్తాంబుల్ లో పూర్తి చేసుకుంది. అయితే అక్కడ షూటింగ్ జరిగినన్ని రోజులు సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ ని రోజు రాత్రి డిన్నర్ కి తీసుకెళ్ళేవాడట. అయితే దీనికి ఒక ప్రత్యేక కారణం ఉందట.
షూటింగ్ లో కత్రినా ప్రతీ సీన్ కి చాలా టేక్ లు తీసుకునేదట. నీవు గనక ఒకే టేక్ లో సీన్ ని ముగిస్తే రాత్రికి డిన్నర్ కి తీసుకెళ్తానని సల్మాన్ చెప్పేవాడట. దీంతో కత్రినా కైఫ్ చాలా శ్రద్దగా ఒకే టేక్ లో సీన్ లు ముగించడం తో దాదాపు ఇస్తాంబుల్ లో షూటింగ్ జరిగినన్ని రోజులు సల్మాన్ ఖాన్, కత్రినా ఇలా రాత్రి డిన్నర్ లు కొనసాగించారట.
0 comments:
Post a Comment