మహేష్ బాబు దెబ్బతిన్న దారిలోనే రాంచరణ్
 |
మహేష్ రాంచరణ్ |
ప్రిన్స్ మహేష్ బాబు ఏ కారణం చేతనైతే దెబ్బ తిని భంగపడ్డాడో అదే దారిలో రాంచరణ్ వెళ్తున్నట్టు అనిపిస్తోంది. మహేష్ బాబు అతిథి సినిమా తర్వాత మరో సినిమా విడుదల కావడానికి 3 సంవత్సరాల సమయం పట్టింది. ఆ తర్వాత వచ్చిన ఖలేజా కూడా ఫ్లాఫ్ కావడం తో మహేష్ బాబు తీవ్ర నిరాశకి లోనయ్యాడు. ఇప్పుడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కూడా ఎదే దారిలో వెళ్తున్నాడు. ఆరెంజ్ సినిమా చరణ్ ని డైలమా లో పడేసింది. అనుకున్న స్థాయిలో విజయం సాధించక పోవడంతో తర్వాత చేసే సినిమా లో పాత్ర, కథ ఎలా ఉండాలి అన్న దానిపై రాంచరణ్ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాడు.
సంపత్ నంది, వి వి వినాయక్ దర్శకత్వం లో రెండు సినిమాలు వస్తాయి అని వార్తలు వచ్చినప్పటికి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. ట్విట్టర్ లో పోస్ట్ చేసి కూడా చాలా రోజులైంది. ఇలా చూస్తూ పోతే సమయం గడిచిపోతుంది. ఇదే కారణం మహేష్ బాబు చేదు అనుభవాన్ని మిగిల్చింది. రాంచరణ్ ఇప్పటికన్నా మేల్కొని తన తదుపరి సినిమా ని వేగవంతం చేస్తే మంచిదని అభిమానుల కోరిక.
0 comments:
Post a Comment