ఏమైనా చేసుకోండి ... నా టైటిల్ మారదు
|
రాంగోపాల్ వర్మ |
నాగ చైతన్య హీరోగా రాంగోపాల్ వర్మ "బెజవాడ రౌడీలు" సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే విజయవాడ లోని ప్రముఖ సెంటర్లలో ఈ సినిమా షూటింగ్ జరిపారు. ఇంత లోనే సినిమా షూటింగ్ ఆపేయాలని, టైటిల్ మార్చాలని విజయవాడ కు చెందిన పలువర్గాల నుండి ఒత్తిడి వస్తుంది. కానీ తనను ఎన్ని విధాలుగా ఒత్తిడి చేసినా, ఇబ్బంది పెట్టినా బెజవాడ రౌడీలు సినిమా టైటిల్ మాత్రం మార్చేది లేదని స్పష్టం చేశాడు రాంగోపాల్ వర్మ. ఈ విషయం గురించే తన ట్విట్టర్ అకౌంట్ లో - " ఎవరు ఏమన్నా, ఏమనుకున్నా, ఏమి చేసినా, ఏమి చేస్తామన్నా ఈ టైటిల్ మారదు. ఇదే నా తుది నిర్ణయం " అని పోస్ట్ చేశాడు. మన వివాదాల వర్మ కి ఈ సినిమా కి కూడా ఉచిత పబ్లిసిటీ బాగానే లభించేటట్టుంది.
0 comments:
Post a Comment