బావమరిది తోనే కాదు బావ తో కూడా సై - జెనీలియా
|
జెనీలియా |
ఆరెంజ్ సినిమా లో జెనీలియా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని నిర్మాత నాగబాబు ప్రచారం చేశాడు. అప్పటినుండి జెనీలియా కి సినిమా అవకాశాలు కొద్దిగా తగ్గినట్టుగా అనిపించింది. జెనీలియా ప్రస్తుతం రాణా హీరోగా నటిస్తున్న "నా ఇష్టం" సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా రాంగోపాల్ వర్మ దర్శకత్వం లో నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న "బెజవాడ రౌడీలు" చిత్రం లో కూడా జెనీలియా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే జెనీలియా కి మళ్ళీ అవకాశాల వెల్లువ ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తోంది. బావ బావమరుదులు ఇద్దరితోనూ జత కడుతోందన్నట్టు మన జెనీలియా.
0 comments:
Post a Comment