రజనీకాంత్ కి చికిత్స కన్నా ఏకాంతం కావాలి
 |
రజనీకాంత్ |
ఇటీవల రజనీకాంత్ అనారోగ్యం తో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే రజనీకాంత్ కి ఉన్న అభిమానుల సంఖ్య అంతా ఇంతా కాదు. ఆయన హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి అభిమానుల తాకిడి ఎక్కువయ్యింది. రజనీకాంత్ శరీరం చికిత్స కి బాగానే స్పందిస్తోంది. డాక్టర్లు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రజనీకాంత్ ని త్వరగానే మామూలు స్థితికి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ రజనీకాంత్ ని పరామర్శించేదుకు వచ్చే వి ఐ పి ల వలన ఆయనకి విశ్రాంతి లేకపోతుంది. హాస్పిటల్ బయటనేమో అభిమానుల సందడి, లోపల నేమో వి ఐ పి ల పరామర్శ దీంతో రజనీకాంత్ కి కావలసిన విశ్రాంత్ లభించడం లేదు. దీని వలన డాక్టర్లు బాగా ఆలోచించి రజనీకాంత్ ఇండియా ని వదిలితే తప్ప ఆయనకి కావలసిన విశ్రాంతి లభించదని గుర్తించారట. అందుకే సింగపూర్ కి మెరుగైన చికిత్స నిమిత్తం అని పంపారట. దీంట్లో చికిత్స కన్నా ముఖ్యమైన విషయం విశ్రాంతి అనే తెలుస్తోంది.
0 comments:
Post a Comment