Home » » టీనేజ్ అమ్మాయిలకు ప్రత్యేకం

టీనేజ్ అమ్మాయిలకు ప్రత్యేకం

Mallu Surf


టీనేజీ కి వచ్చిన తర్వాత ప్రతీ అమ్మాయి తను అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటుంది. అయితే ఇదే సమయం లో కొన్ని ప్రకృతి సహజంగా ఎదురయ్యే సమస్యలతో శరీరం లో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యం గా మొహంపై మొటిమలు ఏర్పడటం.

                     టీనేజ్ వచ్చే సరికి శరీరం లో వచ్చే మార్పులు, లైంగిక పరమైన మార్పుల వలన శరీరం పై మొటిమలు ఏర్పడతాయి. ఈ మొటిమలు ఏర్పడటానికి కారణం ఏమిటంటే అదనంగా ఉత్పత్తి అవుతున్న సెక్స్ హార్మోన్లు రక్తం లో అధికంగా కలవడం తో శరీర గ్రంధులు తైల పదార్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. గాలిలోని దుమ్ము, ధూళి, రేణువులు ముఖం మీద పడినపుడు జిగటలా ఏర్పడి శరీర గ్రంధులను మూసివేస్తాయి. ఉప్తత్తి అవుతున్న తైల పదార్థం బయటకి రావడం వీలు కాకపోవడం వలన అడుగున చేరి ఉబ్బెతుగా ఏర్పడతాయి. ఇవే మొటిమలు.

                వీటి నుండి జాగ్రత్త పడాలంటే బయట నుండి వచ్చిన తర్వాత లేదా రోజుకు మూడు సార్లు సబ్బుతో ముఖం బాగా కడుక్కోవాలి. మొటిమలను గిల్లడం, సూదులతో పొడవడం చేయకూడదు. ఇంకా సమస్య అలాగే ఉంటే మంచి చర్మ నిపుణులను సంప్రదిస్తే సరిపోతుంది.   

Share this article :
 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger