ఖుష్బూ పై అలిగిన నటుడు కార్తీక్
 |
ఖుష్బూ |
కార్తీక్, ఖుష్బూ జంటగా చాలా చిత్రాల్లో నటించారు. కార్తీక్ నాకు మంచి మిత్రుడని ఖుష్బూ కూడా అప్పుడప్పుడు చెపుతూ ఉంటుంది. కార్తీక్ ని డి ఎం కె పార్టీ లో చేరమని సలహా ఇచ్చింది ఖుష్బూ యే నట. డి ఎం కె లో చేరితే మంచి పదవి ఇప్పిస్తానని సలహా కూడా ఇచ్చిందట. ఆ హామీ మీదనే కార్తీక్ డి ఎం కె లో చేరాడు. లేకపోతే జయలలిత పార్టీ లో చేరాలని ఆయన కోరికనట. అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో కరుణానిధి డి ఎం కె పార్టీ ఘోర పరాజయం పాలవడంతో కార్తీక్ ఆందోళన లో పడ్డాడట. తన ఆలోచన ప్రకారం జయలలిత తో ఉంటే పరిస్థితి బాగా ఉండేదని ఇప్పుడు భావిస్తున్నాడట. కానీ ఖుష్బూ కూడా డి ఎం కె ఓటమిని ఊహించి ఉండదు.
0 comments:
Post a Comment