
బాలీవుడ్ లో ఆసిన్ కెరీర్ అంతంత మాత్రంగానే కొనసాగుతుంది. గత మూడు సంవత్సరాల నుండి ఆసిన్ చేసింది కేవలం మూడు సినిమాలు మాత్రమే. కానీ సినిమాల కంటే ఎక్కువగా వదంతులు మాత్రం వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ తో ప్రేమ వ్యవహారం నడుస్తుందని, నీల్ నితిన్ ముఖేష్ తో ఎఫైర్ ఉందని, షారూఖ్ ఖాన్ తో నటించబోతుందని ఇలా చాలానే వదంతులు వచ్చాయి. అయితే వీటిపై బాలీవుడ్ దర్శకుడు రితేష్ శెట్టి మాట్లాడుతూ వీటన్నింటిని ఆసినే ప్రచారం చేస్తుందని తెలిపాడు. సినిమాల అవకాశాలు పెంచుకోవడం కోశం, సినిమాలు చేయకపోయినా తన పేరు ఇండస్ట్రీ లో ఎప్పుడూ ప్రచారం లో ఉండేందుకే ఆసిన్ ఇలా వదంతులు ప్రచారం చేస్తుందని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు.
0 comments:
Post a Comment