అల్లు అర్జున్ తన రూట్ ని మార్చినట్టు అనిపిస్తోంది. వరుడు, వేదం లాంటి లాంటి ఆఫ్ బీట్ చిత్రాలు పై బోరు వచ్చిందో లేక బద్రీనాథ్ వంటి హెవీ యాక్షన్ చిత్రం పై మోజు తగ్గిందో తెలియదు కానీ.. ఫుల్ లెంత్ కామెడీ చిత్రం చేయడానికి సిద్దమాయాడు బన్నీ. తన తదుపరి చిత్రం లో కామెడీ డోస్ పెంచాలని నిర్ణయించుకున్నాడు మన అల్లు అర్జున్.నాలుగు నెలల నుంచి ప్రాసెస్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ కి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్. త్రివిక్రం శ్రీనివాస్ దీనికి దర్శకుడు. జూలై మూడవ వారం నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment