టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నిజాన్ని నెమ్మదిగా తెలుసుకుంటున్నాడు. అగ్ర దర్శకుడు శంకర్ తో సినిమా చేసే అవకాశం తెలుగు హీరోలెవరికి దక్కలేదు. అయితే ఆ అవకాశం తెలుగు, తమిళ భాషలలో వస్తున్న త్రీ ఇడియట్స్ రీమేక్ చిత్రం లో మహేష్ బాబు ని హీరోగా పెట్టాలని నిర్ణయించుకున్నాడు శంకర్. కానీ దూకుడు చిత్రం డేట్స్ కి ప్రాబ్లం వస్తుందని ఆ అవకాశాన్ని వదిలేశాడు మహేష్ బాబు. కానీ ఒక మంచి దర్శకుడి అవకాశాన్ని వదులుకున్నానని ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహేష్ బాబు స్వయంగా తెలిపాడు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment