కాజల్ అగర్వాల్ పై దర్శక నిర్మాతలు ప్రస్తుతం తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. దీనికి కారణం కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తమిళ చిత్రం "సింగం" హింది రీమేక్ లో నటిస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబాయి లో జరిగిన ఓ కార్యక్రమం లో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ... "నేను ఎప్పుడు సౌత్ ఇండియా హీరోయిన్ ని అని భావించలేదు" అని చెప్పింది. దీనికి ఇక్కడి దర్శక నిర్మాతలు చాలా బాధపడ్డారట. తెలుగు తమిళ చిత్రం రంగాలలో పెరిగి కోట్ల రూపాయల పారితోషికం తీసుకొని సౌత్ ఇండియా హీరోయిన్ ని కాను అని చెప్పుకోవడం చాలా తప్పు అని భావిస్తున్నారట. తెలుగు సినీ దర్శక నిర్మాతలయితే కాజల్ అగర్వాల్ ని ఇప్పటి నుంచి పరాయి హీరోయిన్ లానే చూడాలని డిసైడ్ అయ్యారట.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment