
ఈ దీపావళి కి పెద్ద హీరోల సినిమాలు లేనట్లే తెలుస్తోంది. దసరాకి మహేష్ బాబు దూకుడు, జూనియర్ ఎన్ టి ఆర్ ఊసరవెల్లి విడుదలయ్యాయి. కానీ ఈ హవా దీపావళికి లేనట్లే తెలుస్తోంది. కానీ ఈ దీపావళికి ఇతర భాషా చిత్రాలు మాత్రం పెద్ద సంఖ్యలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సూర్య హీరోగా నటించిన "సెవెంత్ సెన్స్" తో పాటు మొత్తం 10 చిత్రాల వరకు ఈ దీపావళి సీజన్ లో విడుదలవుతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎన్ని సినిమాలు హిట్, ఎన్ని ఫట్ అనేది దీపావళి తర్వాత కానీ చెప్పలేం.
0 comments:
Post a Comment