Home » , » ప్రభాస్, రాఘవ లారెన్స్ ల "రెబల్" షూటింగ్ వివరాలు

ప్రభాస్, రాఘవ లారెన్స్ ల "రెబల్" షూటింగ్ వివరాలు

Mallu Surf
మాస్, డాన్, కాంచన లాంటి హిట్ చిత్రాలను తీసిన ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వం లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం "రెబల్". జె. భగవాన్, జె.పుల్లా రావు ఈ రెబల్ చిత్రానికి నిర్మాతలు. ప్రభాస్ సరన తమన్నా, దీక్షా సేథ్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబందించిన చివరి షెడ్యూల్ ని నవంబర్ 5 నుంచి ఏకదాటిగా జరగనుంది. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ ఈ రెబల్ చిత్రం ప్రభాస్ కెరియర్ లో ఒక మంచి చిత్రం గా నిలిచిపోతుందని , ఈ క్యారక్టర్ ని ప్రభాస్ తప్ప మరెవరూ చేయలేరని అన్నారు. రెబల్ చిత్రం అన్ని విధాలా ఒక మంచి చిత్రం గా నిలుస్తుందని తెలియజేశారు.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger