
ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు భార్య పద్మ శుక్రవారం మృతిచెందారు. గత కొద్ది కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న పద్మ ఈ ఉదయం తెల్లవారు జామున స్థానిక సోమాజిగూడ లోని యశోధ ఆసుపత్రిలో మృతిచెందారు. దాసరి పద్మ గారు దాసరి నారయణ రావు గారు దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు నిర్మాతగా పనిచేశారు. ఈ విషయం తెలిసిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దాసరి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
0 comments:
Post a Comment