
ఈ వార్త అబ్బాయిలకు చేదువార్త గానే చెప్పాలి. బబ్లీ గర్ల్ గా పేరు పొందిన జెనీలియా త్వరలో శ్రీమతి కాబోతుంది. బాలీవుడ్ కథానాయకుడు రితేష్ దేశ్‌ముఖ్ కి జెనీలియా కి చాలా రోజులుగా ప్రేమ ఉంది. జెనీలియా ఫిబ్రవరి 3 వ తేదీన పెళ్ళి చేసుకోబోతుంది. ఈ వివాహం సన్నిహిత స్నేహితులు, సినీ ప్రముఖుల మధ్యనే జరగనుంది. జనవరి 31 వ తేదీన ముంబాయి లోని గ్రాండ్ లాండ్ హోటల్ లో సంగీత్ కార్యక్రమం జరగనుంది. పెళ్ళి ఫిబ్రవరి 3 వ తేదీన గ్రాండ్ హయత్ లో జరగనుంది. కాబోయే దంపతులకు మనమూ శుభాకాంక్షలు తెలియజేద్దాం.
మీ స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి.
0 comments:
Post a Comment