ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరి మెరుగైన వైద్యం కోసం సింగపూర్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే రజనీకాంత్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కూడా అయ్యాడు. మరో 15 రోజుల తర్వాత ఇక్కడికి వస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే రజనీకాంత్ కోసం చిరంజీవి సింగపూర్ వెళ్ళాడు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. రజనీకాంత్ ఇక్కడికి వచ్చిన తర్వాత పలకరించేకంటే సింగపూర్ లోనే ప్రశాంతగా కలవవచ్చని చిరంజీవి భావించాడట. అందుకని రజనీకాంత్ కోసం ప్రత్యేకంగా సింగపూర్ ఫ్లైట్ ఎక్కాడట మన మెగాస్టార్.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment