అస్వస్థతకి గురయి చికిత్స నిమిత్తం సింగపూర్ వెళ్ళిన రజనీకాంత్ పూర్తిగా కోలుకున్నాడు. అయితే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని రోజులు సింగపూర్ లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాడు రజనీకాంత్. ఈ నేపధ్యం లో అభిమానులకు ఒక లేఖ రాసి మీడియాకి విడుదల చేశాడు రజనీకాంత్. అభిమానులు చూపిన ప్రేమ, ఆప్యాయత ఎప్పటికి మరిచిపోలేనని వారు చేసిన పూజలు, ప్రార్థనలే తనని త్వరగా కోలుకునేలా చేశాయని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి అభిమానులను సంతోషపెట్టడమే తన కర్తవ్యమని , రానున్న రాణా సినిమాలో నటించి అభిమానులను ఆనందపరుస్తానని రజనీకాంత్ పేర్కొన్నారు.

0 comments:
Post a Comment