రతి లో పాల్గొన్నప్పుడు నొప్పి కలగడం అనేది రకరకాల కారణాల మీద ఆధార పడి ఉంటుంది. ఇది శారీరక కారణాల వలన కలగవచ్చు. కొన్ని కొన్ని సార్లు మానసిక కారణాల వలన కూడా కలగవచ్చు. ఒక గైనకాలజిస్ట్ 400 మంది స్త్రీలను సంప్రదించినప్పుడు అందులో 40 శాతం మంది మొదటి సారి లేదా పాల్గొన్న ప్రతీ సారి కొద్దిగా నొప్పి కలుగుతుందని తెలిపారు. ఇందులో కేవలం 4 శాతం మంది మాత్రమే చికిత్స కోసం డాక్టర్లను సంప్రదించినట్టు తెలిపారు. ఈ నొప్పికి రకరకాల కారణాలు ఉన్నాయి. రతి కార్యం జరిగేటప్పుడు విడుదలయ్యే స్రవాలు సరిగ్గ విడుదల కాకపోవడం, కామోద్రేకం కలిగిన తర్వాత గర్భాశయం పైకి లేవడం, మొదటి సారి భయంతో సెక్స్ లో పాల్గొనడం వలన యోని దగ్గర అదిమి పట్టుకోవడం వలన అంగ ప్రవేశం సరిగ్గ జరగకపోవడం వలన ఈ నొప్పి కలుగుతుంది.
0 comments:
Post a Comment