
అగ్ర హీరో కమల్‌హాసన్ ఎంత పనిమంతుడో అందరికీ తెలుసు. కమల్‌హాసన్ ఏదైన సినిమా చేస్తున్నాడంటే అది పూర్తయ్యేవరకు తన ఏకాగ్రత మొత్తం ఆ సినిమా పైనే ఉంటుంది. ప్రస్తుతం కమల్‌హాసన్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం "విశ్వరూపం". ప్రస్తుతం 57 సంవత్సరాల వయస్సు ఉన్న కమల్‌హాసన్ ఈ సినిమా కోసం 15 నుంచి 20 గంటలు కష్టపడుతున్నాడట. విశ్వరూపం సినిమా ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కమల్‌హాసన్ ఈ సినిమా ని ఒక పెద్ద హిట్ చేసేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాడు.
0 comments:
Post a Comment