Home » , » Sunil busy schedule in Tollywood Events

Sunil busy schedule in Tollywood Events

Mallu Surf



కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ టాలీవుడ్ లో బిజీ హీరోగా మారిపోయాడు. నిన్న (19 జనవరి) టాలీవుడ్ లో రెండు భారీ చిత్రాల ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. అవి మంచు మనోజ్ హీరోగా రూపొందిన "మిస్టర్ నొకియా" మరియు శంకర్ దర్శకత్వం లో వచ్చిన "స్నేహితుడు". అయితే ఈ రెండు కార్యక్రమాలలో సునీల్ అతిథిగా పాల్గొన్నాడు. మొదట స్నేహితుడు ఆడియో కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ కొద్ది సేపటి తర్వాతనే మిస్టర్ నొకియా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కనిపించాడు. 


పూలరంగడు సినిమా కోసం సిక్స్ ప్యాక్ దెవలప్ చేసిన సునీల్ దాని తర్వాత పబ్లిక్ గా కనిపించడం ఇదే తొలిసారి. సునీల్ మొఖం లో మార్పు కనిపించింది. మిస్టర్ నొకియా ఆడియో రిలీజ్ లో మాట్లాడుతూ ఈ సినిమా తన పూలరంగడు సినిమా కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అని సునీల్ చెప్పడం విశేషం.


మీ స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger